రాజీనామాల‌తో కొత్త డ్రామా : అనిత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేయ‌డానికి సీఎం జ‌గ‌న్ కంక‌ణం కట్టుకున్నార‌ని మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. వైకాపా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మూడు రాజ‌ధానుల పేరిట డ్రామాకు తెర‌లేపార‌న్నార‌ని ఆరోపించారు. అది కాస్తా ముగింపు లేని టీవీ సీరియ‌ల్‌గా మారింద‌న్నారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల‌తో మ‌రో డ్రామా మొద‌లుపెట్టార‌ని విమ‌ర్శించారు. ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కొర‌కు మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఏర్పాటు చేస్తే…. క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగి, మూడు రాజ‌ధానులు అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టి ప్ర‌జ‌ల‌ను క‌ష్టాల పాలు చేస్తున్నార‌ని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు చేసినంత మాత్రానా…. విశాఖ రాజ‌ధాని అవుతుందా అని ప్ర‌శ్నించారు. ఏపీ భ‌విష్య‌త్తు అమ‌రావ‌తితోనే ముడిప‌డింద‌న్నారు ఆమె.