నాగుల‌ప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం

సేక‌ర‌ణ – కృష్ణ‌
మెద‌క్ జిల్లా తూప్రాన్ సమీపంల‌ని నాగులప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డ ప్ర‌మాదం జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే… నాగుల‌ప‌ల్లి గ్రామ స‌మీపంలో ఎదురెదురుగా వ‌స్తున్న ఇన్నోవ కారు ఆటోను ఢీ కొట్ట‌డంతో ఆటో రోడ్డుపై నుండి కిందికి ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తండ్రి ఇద్ద‌రు పిల్ల‌ల‌కి తీవ్ర గాయాల‌య్యాయి. సమీపంలోని దేవాల‌యాన్ని ద‌ర్శించుకొని వ‌స్తున్న త‌రుణంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఇన్నోవ కారు అతివేగంగా రావ‌డం వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. కాగా గాయాలైన చిన్నారులు ఏడాది వ‌య‌సు గ‌ల చిన్నారి ఉండ‌డంతో వారి కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.