బిగ్ బాష్ బిజినెస్ లీగ్ జెర్సీల ఆవిష్క‌ర‌ణ‌

  • ముఖ్య అతిథులుగా హాజ‌రైన త‌ల‌సాని సాయికిర‌ణ్‌, అర్ష‌ద్ అయూబ్, జాన్ మ‌నోజ్
  • అక్టోబ‌ర్ 1 నుంచి మ్యాచ్‌లు

డెక్క‌న్ న్యూస్‌, క్రీడా విభాగం: బిగ్ బాష్ బిజినెస్ లీగ్ 2022 సంద‌డి న‌గ‌రంలో మొద‌లైంది. దీనికి సంబంధించిన జెర్సీల‌ను బేగంపేట‌లోని కంట్రీక్ల‌బ్‌లో మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించారు. త‌ల‌సాని సాయికిర‌ణ్‌, అర్ష‌ద్ అయూబ్, జాన్ మ‌నోజ్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజ‌రై, ఆరు జ‌ట్ల‌కు సంబంధించిన జెర్సీల‌ను ఆవిష్క‌రించారు. ఈవీ స్పోర్ట్స్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ య‌జ‌మాని ఈమ‌ని వెంక‌ట్ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. బిగ్ బాష్ బిజినెస్ లీగ్ 2022 క్రికెట్ మ్యాచ్‌లు అక్టోబ‌ర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. నాగిరెడ్డిగూడ‌లోని విజ‌య‌ల‌క్ష్మి క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారు.

నిరంత‌రం వ్యాపారాల్లో మునిగితేలే వ్యాపార‌వేత్త‌ల‌కు కాస్త విరామం క‌ల్పించేందుకు ఈ బిగ్ బాష్ బిజినెస్ లీగ్ నిర్వ‌హిస్తున్నారు. మొత్తం 14 రోజుల పాటు ఈ టోర్న‌మెంట్ జ‌రుగుతుంది. ప‌లువురు వ్యాపార‌వేత్త‌లు ఆరు జ‌ట్లుగా ఈ టోర్న‌మెంటులో పాల్గొంటారు. ఒక్కో జ‌ట్టుకు ఒక్కో య‌జ‌మాని కూడా ఉంటారు. కళానికేతన్, సిరిసంపద, డిజైన్ వాల్స్, వార్మ్ ఓవెన్, లారెన్స్ అండ్ మేయో, డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సర్వీసెస్, సిఆర్ఎం ఎంటర్‌ప్రైజెస్ మరియు టీ రుచి స్పాన్సర్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఈ క్రికెట్ లీగ్‌ను ఎస్‌బి ప్ర‌కాష్ ముందుగా ప్రారంభించారు. అప్ప‌టినుంచి విజ‌య‌వంతంగా సాగుతోంది.