బొత్సకు బొచ్చు తప్పా బుద్ధి లేదు : అనిత
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై తనదైన శైలిలో మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. తమ పార్టీ చేస్తున్న పాదయాత్రపై సంస్కరాం లేకుండా మంత్రి మాట్లాడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని కాపాడుకోవడానికి, రైతులకు న్యాయం చేయడానికి తమ పార్టీ కృషి చేస్తోందని అన్నారు. కానీ మంత్రికి బొత్సకు మాత్రం బొచ్చు తప్పా… బుద్ధి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి అధికార దాహంతో… రాష్ట్ర ప్రజలను ఇబ్బది పెట్టడం తప్పా… చేసింది ఏం లేదన్నారు. రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే… వారిని కించపరిచేలా మంత్రి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది తమ పార్టీనేనని అన్నారు.