కార్తికేయ హాస్పిటల్‌లో అగ్ని ప్రమదం ఇద్దరు చిన్నారుల మృతి
డెక్కన్ న్యూస్, తిరుపతి :
రేణిగుంట టౌన్,భగత్ సింగ్ కాలనీ లో తెలవారుజామున నూతనంగా నిర్మిస్తున్న కార్తికేయ హాస్పిటల్ లో మంటలు చెలరేగాయి. వేంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేయడానికి ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న ఇద్దరి ప్రాణాలకు కాపాడారు. లోపల ఉన్న మిగత ముగ్గరి కోసం సహాయక చర్యలు చేపట్టారు. కరెంటు షార్ట్ సర్క్యూట్ తోనే ఘటన జరిగినట్లు భావిస్తున్న ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదం జరగడంతో హాస్పిటల్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి. మృతులు భరత రెడ్డి, కార్తీక్ గా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్చి ఉంది.