ఎన్టీఆర్‌ని అవ‌మానించిన వైకాపా

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాదాపుగా అన్ని
తెదేపా మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన మండిప‌డ్డారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో నుంచి ఎన్టీఆర్ పేరును తీసి వేయడం అంటే.. ఎన్టీఆర్ ను అవమానించినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఒక గొడుగు కిందకు తీసుకురావాలన్న మంచి ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ ఈ సంస్థను ఏర్పాటు చేశారని ఆమె చెప్పుకొచ్చారు. స్వలాభాపేక్ష లేకుండా ఎన్టీఆర్ పాలన సాగిస్తే… ఇప్పటి పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును ఎందుకు మార్చారో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఓ వైపు ఎన్టీఆర్ పై తనకు అపార గౌరవం ఉందంటూనే… ఆయన పేరును తొలగించడం అన్యాయమని ఆమె అన్నారు.