రెండోసారి ఇన్సపెక్టర్ నాగేశ్వర్ బెయిల్ తిరస్కరణ
వనస్తలిపురం పి.స్ లో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ ఆదారంగా రిమాండుకు తరలించబడిన నాగేశ్వర రావు గత 60 రోజులుగా జైలులో ఉండగా, తాజాగా బెయిల్ కోసం రెండవ సారి అర్జీ పెట్టుకోగా నిరాకరించిన VII వ అదనపు జిల్లా జడ్జ్. వివరాల్లోకి వెళితే, నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున మరియు అలాంటి పరిస్తితులను నిందితుడు సీన్ రీకస్ట్రన్ సమయంలో ఉత్పన్నం చేశాడని మరియు అధికారులను, సాక్షులను నిందితుడు భయబ్రాంతులకు గురిచేసి, విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అభ్యర్తన తిరస్కరించాలని అడిషనల్ పి.పి గారు పది పేజిల కౌంటర్ ను దాకలు చేసారు. పి.పి వాదనను సమర్దించిన కోర్టు బెయిల్ అభ్యర్తనను తిరస్కరించారు.