మా పేరు చెప్పి మీరు పెడితే ఊరుకోం – బండి సంజ‌య్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మ‌రోమారు మండిప‌డ్డారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్. త‌న కొడుకు, కుమార్తెపై వస్తోన్న అవినీతి ఆరోపణలతో సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని అన్నారు. ‘‘మునుగోడు ఉపఎన్నికలో ఒడిపోతామనే భయం కేసీఆర్‌కు పట్టుకుందని పేర్కొన్నారు. దీంతో సీఎం బాగా మాన‌సిక ఆందోళ‌న చెందుతున్నార‌ని అన్నారు. ఎన్నికలు వస్తేనే మోటార్లకు మీటర్లు గుర్తొస్తాయని ప్ర‌శ్నించారు. మా పేరు చెప్పి మీటర్లు పెడితే ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోడానికి ప్రజలు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు’’ అని బండి సంజయ్‌ విమర్శించారు.