తెలంగాణా విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.646 శాతం కరువు భత్యం(DA) పెంచుతూ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో) సీఎండీ డి. ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల DA 24.992శాతం నుంచి 28.638 శాతానికి పెరిగింది. గత జులై 1నుంచి DA పెంపు అమలు కానుంది. జులై నెల DA బకాయిలను ఆగస్టు నెల జీతం/పెన్షన్‌తో కలిపి ఇవ్వనున్నారు.