విజయ శాంతి గారు ప్రస్తుత రాజకీయాలలో మన మహిళల పాత్ర ఇంతే..!
తెలంగాణ తెలుగుదేం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన భారతీయ జనతా పార్టీ నాయకురాలు విజయశాంతికి లేఖ రాశారు. ప్రస్తుత రాజకీయాల్లో మహిళల పాత్ర, ఎదురవుతున్న ఇబ్బందులు, వారికి ఇస్తున్న ప్రాధాన్యం గురించి చర్చించారు.
స్వాతంత్ర ఉద్యమంలో మహిళలకి అత్యధిక ప్రాతినిధ్యం ఉండేది.
భారత జాతీయ కాంగ్రెస్ కి విదేశీయురాలు అయిన అనిబిసెంట్ నాయకత్వం వహించింది.. అంతకు ముందు సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది, ముందు ఉండి నడిపించింది..
దండి సత్యాగ్రహాన్ని స్వాతంత్ర పోరాటాన్ని మహామత్మ గాంధీతో కలిసి సరోజినీ నాయుడు నడిపించింది..
సుభాష్ చంద్రబోస్ తో కలిసి ఆజాద్ హింద్ ఫౌజ్ నీ కెప్టెన్ లక్ష్మి సారథ్యం వహించింది..
నెహ్రూ సతీమణి కమలా నెహ్రూ సుచేత కృపాలని, అరునాసాఫలి, కౌర్, మణిపూర్ గిరిపుత్రిక పద్మజానాయుడు, దుర్గాబాయి దేశ్ ముఖ్ ,
మాగంటి అన్నపూర్ణమ్మ ,
భారతిదేవి రంగా, సూర్యదేవర రాజ్యలక్ష్మి,మొదలైన వారికి మంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు..
వారికి ఆ నాటి నాయకులు , నాయకత్వ బాధ్యతలు ఇవ్వగలిగారు…
కానీ కాలం మారింది. సమానత్వం సాధించుకున్నాం అని చెప్పుకుంటున్న మాకు, అన్ని రాంగాల్లో పురోగమనం సాధించాం అని చెప్పు కుంటున్న మేము రాజకీయ చక్రంలో, అనేక బాధలు పడుతున్నాం..
అవమానాలు ఎదుర్కుంటున్నాం.
ఇంత వరకు మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించుకొలేక పోయాము..
దానికి కారణం ఏమిటి..?
ఒక జయలలిత,మాయావతి,
నందిని శతపది,
మమత బెనర్జీ వీరందరూ ముఖ్యమంత్రులు అయిన ఎన్ని అవమానాలు, ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు..?
ఉన్న ఏకైక ప్రధాన మంత్రి ఇందిరా గాంధీనీ చంపుకోలేదా మనం…?
సోనియా గాంధీని ప్రధాన మంత్రి కానిచ్చామ..?
నవీన భారతంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉన్న భార్యల స్థానాల్లో భర్తల పెత్తనం.
వసుందర రాజే సింథియా, ఉమా భారతి పరిస్థితి ఏమిటి..?
రామజన్మ భూమి విషయంలో అయోధ్య రామ మందిరం నిర్మాణ విషయంలో ప్రముఖ పాత్ర వహించిన ఉమాభారతి గారి పరిస్థితి ఏమిటి ఈరోజు అన్ని పార్టీలు ఒక తాసు ముక్కలే.
ఈనాటి రాజకీయాలలో మగమహారాజులు మహిళలని కేవలం ఉద్యమాలలో పోలీస్ లాటి చార్జీలు వ్యతిరేకంగా ముందు వరుసగా మమ్మల్ని నిలబెడతారు.
7 సంవత్సరాల పాటు తెరాసా పాలనలో మహిళ మంత్రులు లేరు.
ప్రతిభ,దైర్యం,సాహసం,విద్య, పరిపాలన దక్షిత ఉన్న అనేక మంది మహిళలం అన్ని పార్టీలల్లో ఉన్నాం..
కానీ మాకు అందుతున్న స్థానం ఏంటి..! గౌరవం ఏమిటి..?
నాకు సమర్ధత లేదా..?
రేణుకా చౌదరికి సమర్ధత లేదా..?
డీకే రుణ కి లేదా, గీతా రెడ్డికి లేదా,
విజయ శాంతికి లేదా,
కొండా సురేఖకి లేదా,కవితకి లేదా,ఈ రెండు తెలుగు రాష్ట్రాలు సాయుధ పోరాటాలని,స్వాతంత్ర ఉద్యమాలు, మహిళల చేతులతో నడిపించిన నేలలు, శాంతిశ్రీ,రాణి రుద్రమ్మ, నాగమ్మ, మాంచాల,వీరనారులు పుట్టిన గడ్డ ఇది..ఏలిన గడ్డ ఇది..
అయినా మన సవర్ధత,దక్షత, గుర్తించడం వీరికి చేత కాదు.
ఒక్క తాటి మీద,ఒకే ఆలోచనతో రాజకీయాల్లో ఆకర్షణ శక్తి ప్రజలను నడిపించగల శక్తి ఉన్న, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న, ఆడవాళ్ళకి నేటి రాజకీయాలలో చోటు లేకుండా పోయింది.