చీడపురుగులకు అడ్డగా మారిన వైకాపా
ఏపీలోని అధికార పార్టీపై మరోమారు తనదైన శైలిలో మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. తప్పు చేసిన ఎంపీని కాపాడే ప్రయత్నంలో విపక్ష పార్టీపై బురుద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆడవారికి భద్రత లేకుండా పోతోందని దుయ్యబట్టారు. సిగ్గు శరం లేకుండా ఎంపీ వికృత చేష్టలు చేశారన్నారు. ఆడవారు బయట తిరిగే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్న ఎంపీ వైకాపా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.