ఎమ్మెల్సీని పార్టీ నుండి సస్పెండ్ చేసిన వైకాపా
తన మాజీ డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీని పార్టీ నుండి తొలగిసస్తూ ప్రకటన విడుదల చేసింది వైకాపా కార్యాలయం. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన అనంతబాబు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ హత్య కేసులో తన తప్పిదాన్ని అనంతబాబు ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా… న్యాయమూర్తి ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సుబ్రహ్మణ్యం హత్యపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.