ఇలర్న్మార్కెట్స్ ఫేస్2ఫేస్ మెగా ట్రేడింగ్ మొదటి ఎడిషన్ విజయవంతం
ఇండియా యొక్క అతిపెద్ద ఆర్థిక అవగాహనా వేదిక అయిన ఇలర్న్మార్కెట్స్, ఫిన్టెక్ యాప్ స్టాక్ఎడ్జ్ తో పాటుగా, 2022 ఏప్రిల్ 26 నుండి 29 వరకు గోవాలో ఫేస్2ఫేస్ మెగా ట్రేడింగ్ సదస్సు యొక్క మొదటి ఎడిషన్ని విజయవంతంగా నిర్వహించింది. అక్కడ నిపుణులు మరియు పాల్గొన్నవారు ఉభయులూ చురుగ్గా లావాదేవీలు నిర్వహించుకొని మంచి లాభాలను చేసుకున్న లైవ్ ట్రేడింగ్ సెషన్లు జరిగాయి. సెషన్ల సందర్భంగా వారు తెలుసుకున్న పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి చూశారు.
ఈ 3-రోజుల మెగా ట్రేడింగ్ సదస్సుకు హాజరైన వారికి అందులో అనేక అభ్యసన సెషన్లు జరిగాయి. స్టాక్ఎడ్జ్ కూడా తన యాప్ నుండి లావాదేవీలతో సహా అత్యాధునికమైన అనేక ఫీచర్లను ప్రారంభించింది. ఇప్పుడు స్టాక్ఎడ్జ్ వాడుకదారులు అందరూ యాప్ నుండే నేరుగా తమ సంబంధిత జీరోధా, కోటక్ సెక్యూరిటీస్, గ్రో మరియు మరెందరో బ్రోకర్లతో ఆర్డరు చేయగలుగుతారు.
ఈ సదస్సులో ప్రముఖ ట్రేడర్ అసిత్ బరన్ పాటి గారు విభిన్న ట్రేడింగ్ సూచికల సహాయముతో కొనుగోలు వ్యూహాల ఆప్షన్లపై ఒక సెషన్ నిర్వహించారు మరియు విశాల్ మల్కాన్ గారు సాంకేతిక పోకడలను ఉపయోగించి స్వల్ప-కాలిక ట్రేడింగ్ పైన చిట్కాలను తెలియజేశారు. వివేక్ బజాజ్ మరియు ప్రమల్ పారేఖ్ గారు కూడా సాపేక్ష శక్తిని ఉపయోగించి స్వింగ్ ట్రేడింగ్ వ్యూహాలపై చర్చించారు.
ప్రసిద్ధ ఆప్షన్స్ స్కాల్పర్ శివకుమార్ జయచంద్రన్ గారు, 2-క్యాండిల్ సిద్ధాంతమును ఉపయోగించి ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎలా డబ్బు చేసుకోవాలో పాల్గొన్నవారికి ప్రదర్శించి చూపారు. మార్కెట్ నిర్మాణము గురించి పాల్గొన్నవారికి అవగాహన కల్పించడానికి సుప్రసిద్ధ ప్రముఖవ్యక్తి పియూష్ చౌధరీ గారు బహుళ-అసెట్ ట్రేడింగ్ పైన ఒక సెషన్ తీసుకున్నారు మరియు కునాల్ సరోగీ గారు వాల్యూము భ్రాంతులతో ట్రేడింగ్ గురించి శిక్షణ ఇచ్చారు.
సదస్సు యొక్క ఆఖరి రోజున లైవ్ ట్రేడింగ్ సెషన్ క్రిందన, విజయ్ థాకరే, శివకుమార్ జయచంద్రన్, అసిత్ బరన్ పాటి, చేతన్ పంచామియా, విశాల్ మల్కాన్, మరియు కునాల్ సరోగీ గారలు, గత రెండు రోజులలో హాజరైన వారు తాము తెలుసుకున్న వ్యూహాలను ఆచరణలో పెట్టడానికి గాను వారికి ఒక వేదికను అందించారు మరియు మంచి లాభాలను పొందడానికి వారికి సహాయపడ్డారు.
తన మానసపుత్రిక యొక్క విజయం గురించి మాట్లాడుతూ స్టాక్ఎడ్జ్ మరియు ఇలర్న్మార్కెట్స్ సహ-వ్యవస్థాపకులు శ్రీ వివేక్ బజాజ్ గారు ఇలా తెలియజేశారు, “ఆర్థిక అక్షరాస్యత అనేది ఇండియాలో అతి తక్కువగా ఉంటూ వస్తోంది మరియు మా వినియోగదారు ఆర్థిక మదుపును ముందుకు తీసుకువెళ్ళడానికి గాను వారిని మార్కెట్ పోకడలతో నైపుణ్యం పొందేలా చేయడమనేది ప్రారంభం నుండీ కూడా మా ధ్యేయముగా ఉంది. ఇందులో పాల్గొన్నవారి భాగస్వామ్యము మరియు వారు తెలుసుకున్న తీరును చూడడం పట్ల మేము నిజంగా ఎంతగానో ఆనందిస్తున్నాము. స్టాక్ఎడ్జ్ వద్ద ట్రేడ్ ఫీచరును ప్రారంభించడానికి ఈ సదస్సు ఒక సరైన వేదికగా మేము భావిస్తున్నాము. ప్రత్యక్ష మార్కెట్ల సందర్భంగా ట్రేడింగ్ చేయడం అనేది పాల్గొన్న వ్యక్తి పొజిషన్ సైజింగ్, సైకాలజీ, మరియు రిస్క్ యాజమాన్యం విషయంగా నిర్వహణకు వారికి దిశానిర్దేశం చేసింది. ఈ విజయంతో, మదుపరులను సిద్ధం చేయడానికి గాను వారికి నైపుణ్యాలను అందించడానికై అట్టి ఆఫ్లైన్ మరియు లైన్ ఈవెంట్లను తీసుకురావడానికి మేము మరింతగా నిబద్ధులై ఉన్నాము”
తన మొదటి ఎడిషన్ ఫేస్2ఫేస్ మెగా ట్రేడింగ్ సదస్సు యొక్క విజయంతో, ఇది ఇండియాలో స్టాక్ మార్కెట్లో పాల్గొనేవారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కలయిక చోటులలో ఒకటిగా తయారు కాగలదని ఆశించబడుతోంది.