వైకాపా మ‌హిళా నేత‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన : అనిత‌

అధికార పార్టీ మ‌హిళా నేత‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. గ‌త కొన్ని రోజులుగా మ‌హిళల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌పై త‌మ పార్టీ పోరాటం చేస్తుంటే మీరు రాజ‌కీయం చేస్తారా అని మండిప‌డ్డారు. మ‌హిళ‌లలు అని ఏమాత్రం గౌర‌వం ఉన్నా మీరు ఇలా ప్ర‌వ‌ర్తించ‌ర‌ని అన్నారు. జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చిన త‌రువాతే ఆడ‌వారికి ఆభ‌యం లేకుండా పోయింద‌న్నారు. మాజీ ముఖ్య‌మంత్రి, మంత్రుల‌ను ప‌ట్టుకొని నోటి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే ఊరుకునేది లేద‌న్నారు. మీకు తాటాకు చ‌ప్పుల‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డే ప్ర‌సక్తే లేద‌న్నారు. బాధితుల‌ను పరామ‌ర్శించ‌డానికి వ‌స్తే… గెలుపు ఓట‌ముల గురించి ఎలా ప్ర‌స్తావిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు మీ అధికారం ఉండ‌వ‌చ్చు… భ‌విష్య‌త్తు మాదే… అప్పుడు మీకు కూడా త‌గిన స‌మాధానం దొరుకుతుంద‌ని హెచ్చ‌రించారు.