ప్రసవం కోసం వచ్చిన మహిళపై అత్యాచారం
నిజంగా సమాజం తలదించుకోవాల్సిన విషయం. ప్రసవం కోసం వచ్చిన మహిళకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యం చేశాడు ఓ ప్రవృద్దుడు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచాలం ప్రభుత్వ ఆసుపత్రికి ఓ మహిళ ప్రసవం కోసం వచ్చింది. ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకవెళ్లిన ఎంఎన్ఓ లాల్‌ఖాన్ ఆ మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచార ప్రయత్నం చేశాడు. ఇది గమణించిన తోటి ఉద్యోగి ఆస్పత్రి సూపరిడెంట్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో లాల్‌ఖాన్‌కి మోమో జారీ చేసి విచారణ చేపట్టారు. ప్రసవానికి వచ్చిన మహిళపై ప్రభుత్వ ఉద్యోగి ఎలా అఘాయిత్యం చేస్తారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.