ఆడ‌పిల్ల‌కు న్యాయం చేయ‌లేని సీఎం ఎందుకు : అనిత‌

విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. ఆడ‌వాళ్లు అంటే వైకాపా ప్ర‌భుత్వానికి లోకువ‌తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. బాధితుల పరామ‌ర్శ పేరుతో చిన్న‌, పెద్ద తేడా లేకుండా, వ‌య‌సుకి గౌర‌వం ఇవ్వ‌కుండా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నాటకాలు ఆడార‌ని ఆరోపించారు. త‌మ బిడ్డ ఆచూకీ తెల‌ప‌మ‌ని పోలీసుల ముందు మొర పెట్టుకున్నా… స్పందించ‌ని ఖాకీలు వైకాపా ప్ర‌భుత్వంలో ఉన్నార‌ని అన్నారు. దిశ చ‌ట్టం తీసుక‌వ‌చ్చి ఏం లాభ‌మ‌ని అగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. ఓ ఆడ‌పిల్ల‌కు సాయం చేయ‌లేని సీఎం ఉంటే ఎంతా ఉడితే ఎంతా మండిప‌డ్డారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు బాధితురాల‌ని పరామ‌ర్శించ‌డానికి వెళ్తే వాసిరెడ్డి ప‌ద్మా ఆందోళ‌లన చేయ‌డం ఏమాత్రం స‌బ‌బు కాద‌ని వ్యాఖ్యానించారు.