సీక్రెట్ కోడ్‌ల‌తో న‌యా వ్య‌భిచారం

సోష‌ల్ మీడియా విసృత్తంగా అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో వాటిని అదే రేంజ్‌లో వాడుకుంటున్నారు ప్ర‌జ‌లు. మ‌రీ ముఖ్యంగా పోలీసుల‌కు తెలియ‌కుండా గుట్టుగా వ్య‌భిచారం చేసే వారికి ఇది ఒక ఆయుధంగా మారింది. దీంతో పోలీసుల‌కు ఏమాత్రం అనుమానం రాకుండా యువకుల‌ను, సంప‌న్న‌వ‌ర్గాల వారికి వ‌ల‌లు వేస్తున్నారు.

10 రోజుల క్రితం సిటీ పోలీసులు ఓ సెక్స్ రాకెట్ ను ఛేదించారు. నార్సింగిలో సెక్స్ రాకెట్ నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు టెక్నాలజీ వాడుతున్నట్టు తెలిసింది. పోలీసు సిబ్బంది డికాయ్ ఆపరేషన్ ఉచ్చులో పడకుండా ఉండేందుకు కస్టమర్ అథెంటికేషన్ కోసం బ్రోతల్ నిర్వాహకులు రహస్య కోడ్ లను ఉపయోగిస్తున్నారు.విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఒక ఫ్లాట్ పై దాడి చేశారు. అక్కడ నలుగురు ఉగాండా దేశస్తులు ఉన్నారు. అందులో ముగ్గురు సెక్స్ వర్కర్లు ఒక కస్టమర్ ఉన్నారు.

విచారణలో కస్టమర్ బ్రోకర్ ఒకరినొకరు సంప్రదించకుండా కేవలం డేటింగ్ యాప్ రహస్య కోడ్ ద్వారా తమ ఫోన్ నంబర్లను షేర్ చేసుకున్నారు. తర్వాత వాట్సాప్ లో సంభాషణలు సాగాయి.

ఒక రాత్రికి రూ.15వేలు చెల్లించడానికి అంగీకరించిన తర్వాత ప్రత్యేక కోడ్ ద్వారా మహిళను కలుసుకున్నాడు. అయితే నిర్ధిష్ట కోడ్ డిస్ ప్లేతోనే కస్టమర్ మహిళ గదిలోకి వెళ్లాడు. ఇంత పకడ్బందీగా వ్యభిచారం నిర్వహించడం ఇదే ప్రథమమని.. వారి టెక్నాలజీ గుట్టును రట్టు చేసి యాప్ లను చేదించారు పోలీసులు. వ్యభిచార నిర్వాహకురాలు. ఉగాండా మహిళ కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.