తెలుగుదేశం పార్టీ స‌భ్య‌త్వ న‌మోదుకు విశేష స్పంద‌న‌

40 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీకి ఏ మాత్ర ఆద‌ర‌ణ త‌గ్గ‌లేద‌న్నారు మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు పార్టీ స‌భ్య‌త్వ న‌మోదే కార్య‌క్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. గురువారం పార్టీ కార్యాల‌యంలో పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు 2022-24 ప్రారంబోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. డిజిటల్ న‌మోదు కూడా ప్రారంభం చేశారు.