మ‌హానాడు త‌ర్వాత మా స‌త్తా చూపిస్తాం : అనిత‌

తెలుగుదేశం పార్టీ మ‌హానాడు కార్య‌క్ర‌మం త‌ర్వాత త‌మ పార్టీ స‌త్తా ఎంటో మారోమారు నిరూపిస్తామ‌న్నారు ఆ పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత. అధికారంలో ఉన్న వైకాపా రాష్ట్రాన్ని పాలించడం చేత‌కావ‌డం లేద‌ని విమ‌ర్శించారు. వ‌చ్చే నెల‌లో జ‌రిగే మ‌హానాడు త‌ర్వాత త‌మ పార్టీ జాతీయ నాయ‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు నెల‌కు రెండు జిల్లాల చొప్పున ఏపీలోని మొత్తం జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను ఏడాదిలోగా పూర్తి చేస్తార‌ని తెలిపారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో అడుగ‌డున వైకాపా నిరంకుశ పాల‌న తీరుని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తార‌ని అన్నారు. మ‌హానాడు ముగిసిన వెంట‌నే ప్రారంభం కానున్న ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎన్నిక‌లు జ‌రిగే నాటికి మొత్తం రాష్ట్రాన్ని చుట్టేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.