అప్పుడు దాడ‌లు బ్యాచ్, ఇప్పుడు భ‌జ‌న బ్యాచ్‌: అనిత

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న మంత్రి మండలి ఏర్పాటుపై స్పందించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. మంత్రిమండ‌లిలో మ‌నుషులు మాత్ర‌మే మారార‌ని పేర్కొన్నారు. గ‌తంలో ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష దాడులు చేసే మంత్రులు ఉండేవార‌ని, ఇప్పుడు భ‌జ‌న‌లు చేసే బ్యాచ్ మంత్రులు అయ్యార‌ని విమ‌ర్శించారు. అవినీతి అజ్యం పోసే మ‌నుషుల‌ను సీఎం త‌న మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నార‌ని ఆరోపించారు. ఎప్పుడూ త‌న భ‌జన చేసే వారికి మాత్ర‌మే మంత్రిప‌దువులు క‌ట్ట‌బెట్టార‌ని అన్నారు. నిజాయితీగా ప‌ని చేసే మంత్రులు, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ప‌రుగులు పెట్టించే వారే లేరన్నారు.
ఇక మంత్రి ప‌ద‌వి పోవ‌డంతో రాజీనామా చేసిన మేక‌పాటి సూచ‌రిత, ఈ పౌరుషాన్ని అమాయ‌క‌పు ఆడ‌పిల్ల‌లు బ‌లైన‌ప్పుడు చూపించి ఉంటే బాగుడేంద‌న్నారు. అంతేకానీ రాజ‌కీయ ఎదుగుద‌ల‌ను దృష్టిలో పెట్టికొని డ్రామాలు ఆడితే ప్ర‌జ‌లు విశ్వసించ‌ర‌ని అన్నారు. ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత వంగి, వంగి దండాలు, ముద్దులు పెట్టిన వారు ఏమేర ప‌ని చేస్తారో అప్పుడే తేలిపోయింద‌న్నారు.