సీఎంపై మండిప‌డ్డా అనిత‌

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మ‌రోమారు మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్యక్షురాలు వంగ‌ళ‌పూడి అనిత‌. అన్నం పెట్టే రైత‌న్న‌ల‌కు సీఎం సున్నం పెడుతున్నార‌ని ఆరోపించారు. రైతులు క‌రెంట్ క‌ష్టాలు ఉంటే పంట‌లు ఎలా పండిస్తార‌ని విమ‌ర్శించారు. రోజు రోజుకి రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితుల‌తో పాటు విద్యుత్ ప‌రిస్థితులు కూడా అగ‌మ‌య్య‌గోచ‌రంగా తయార్యాయ‌ని తెలిపారు. కరెంట్ కోత‌ల‌తో ప్ర‌జ‌లు అల్ల‌డుతున్నార‌ని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప‌క్క‌న పెట్టి సొంత ఖ‌జానా నింపుకునే పనిలో సీఎం బిజిగా అయ్యార‌ని ఆరోపించారు. రోజుకో ప‌థ‌కం పేరుతో రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌భ్య పెడుతున్నార‌న్నారు. సీఎంకు ఏ మాత్రం సిగ్గు, శ‌రం ఉన్నా… విద్యుతు క‌ష్టాల‌ను గ‌ట్టేక్కించాల‌న్నారు.