ఆరోగ్యంపై దృష్టి సారించాలి

  • అతంర్జాతీయ ఆరోగ్య దినోత్స‌వం
  • ఏప్రిల్‌ 7న‌ డాక్ట‌ర్‌. వేదాస్వి రావు వెల్చల,
    కన్సల్టెంట్ ఇంట‌ర్న‌ల్ మెడిసిన్,‌
    కిమ్స్ హాస్పిటల్స్, కొండపూర్.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను ఆరోగ్యంగా ఉండాల‌పి ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తుంది అంత‌ర్జాతీయ ఆరోగ్య సంస్థ (WHO). ప్ర‌తి సంవ‌త్స‌రం ఏప్రిల్ 7వ తేదీన అంత‌ర్జాతీయ ఆరోగ్యదినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తుంది. ఇందులో భాగంగా వివిధ కార్యాక్ర‌మాల ద్వారా ప్ర‌జల్లో అవ‌గాహాన క‌ల్పిస్తుంది. ఈ సంవ‌త్స‌రం కూడా మ‌న గ్ర‌హాం- మ‌న ఆరోగ్యం అనే థీమ్‌తో ముందుకు వెళ్తుంది.

కోవిడ్‌-19 మ‌హామ్మారి ప్ర‌బ‌లిన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఆరోగ్యం-ప‌రిశుభ‌త్ర‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఇప్పుడిప్పుడే త‌గ్గుముఖం ప‌డుతున్న వైర‌స్ ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. కోవిడ్‌-19 త‌ర్వాత మూడు ద‌శ‌ల‌లో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ చూశాం. వాటిని త‌ట్టుకోవాలంటే ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిశుభ్ర‌త‌కు, ఆరోగ్యానికి పెద్దపీట వేయాలి.

వ్యాధుల నుండి కోలుకోవ‌డంలో, మంచి ఆరోగ్యంగా జీవించాలంటే మ‌నం నివ‌సించే ప‌ర్యావ‌ర‌ణ ప్రాంతం చాలా ముఖ్య‌మైన పాత్ర పోషిస్తుంది.

జనాభాలో 90% పైగా శిలాజ మరియు ఇంధనాల దహనం, ఆయా ప‌రిశ్ర‌మ‌ల నుండి వెలుబ‌డే అనారోగ్యకరమైన గాలిని పీల్చుకుంటున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం చర్యలు తీసుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత, ఇది ఏకకాలంలో పర్యావరణాన్ని కాపాడుతుంది మరియు శ్వాసకోశ వ్యాధుల సంభవనీయతను తగ్గిస్తుంది.

కాలుష్యంగా మారిన ప‌రిస‌రాల వ‌ల్ల వైర‌ల్ జ్వ‌రాలు, దోమ‌ల ద్వారా సంక్ర‌మించే వ్యాధులు ఎక్కువుతాయి. కాలానుగుణమైన ఆరోగ్యకరమైన సహజ ఆహారం నుండి అధిక ప్రాసెస్ చేయబడిన ఆహారాలు మరియు పానీయాలకు ఆహారపు అలవాట్లు మారడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్లు మొదలైన వాటిలో పెద్ద పెరుగుదల కనిపించింది. మన సహజ నీటి వనరులను సంరక్షించడం, పరిసరాల్లో చెట్లను నాటడం మరియు వ్యర్థాలను సరిగ్గా పారవేయడం (ఘన మరియు రసాయన) నీరు మరియు నేల కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

ప్ర‌జ‌లు ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల్సిన స‌మ‌యం ఇది. మారుతున్న జీవ‌న శైలిలో భాగంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స‌రైన స‌మ‌యానికి నిద్ర లేవ‌క‌పోవ‌డం, స‌రైన స‌మ‌యంలో భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం అనేవి మ‌నిషి ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతాయి. కాబ‌ట్టి వ్యాయామం, ఆహారంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకోవాలి.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు మనకు ఏమి అవసరమో మరియు మన భవిష్యత్ తరాలకు ఏమి అవసరమో ఒక్క నిమిషం ఆలోచిద్దాం.

మన పరిసర వాతావరణాన్ని మెరుగుపరచడానికి మొదటి అడుగు వేద్దాం.