వాడు మనుషులకే పుట్టాడా లేక…? : వంగలపూడి అనిత
వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత. ఒక్క ఛాన్స్ ఇచ్చిన నేరానికి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. పరిపాలించడానికి వీళ్లకు అధికారం ఇస్తే.. వీళ్లేమో మహిళల తాళిబొట్లు తెంపడం, అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం వంటివి చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలో 14 ఏళ్ల బాలికను ఏపీ ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కొండూరు అనిల్ బాబు కిడ్నాప్ చేసి, రేప్ చేశాడంటే వాడు మనషులకి పుట్టాడా.. లేక గొడ్డుకు పుట్టాడో అర్థం కావట్లేదంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు వంగలపూడి అనిత శనివారం వరుస ట్వీట్లు చేశారు.