బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి :బండి సంజయ్
సికింద్రాబాద్ బోయిగూడ లోని స్క్రాప్ గోదాం లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ ప్రమాదంలో బీహార్ కు చెందిన 11 మంది పేద కార్మికులు సజీవదహనం కావడం కలచివేసిందని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి డిమాండ్ చేశారు.
https://www.kooapp.com/koo/bandisanjay_bjp/3149ff2b-b047-4008-9752-187cc7ecd3dc