ప్రభుత్వ ఉద్యోగికి బోడుప్పల్ తెరాస నేత బెదిరింపులు
తెలంగాణ రాష్ట్ర సమితి నేతల తీరు రోజు రోజుకు మితిమీరిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నారు. అవతలి వారు ఏం చెబుతున్నారో కూడా వినకుండా తనదైన బూతు మాటలతో కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… బోడుప్పల్
మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్ టీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్ అంజలి భర్త శ్రీధర్ గౌడ్ ఇంజనీరింగ్ వర్క్స్ ఇన్స్పెక్టర్ పై ఫోన్ లో రెచ్చిపొయి తిట్ల పురాణం అందుకున్నారు. తాము చెప్పింది వింటే సరే లేదంటే వారికి చూపించారు. తాము చెప్పిన పని చేయకుంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు.