జగ్గారెడ్డికి షాకిచ్చిన కార్యకర్తలు, అనుచరులు
కాంగ్రెస్ పార్టలో ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న సంగారెడ్డి జగ్గారెడ్డి వెంట నడిచే కార్యకర్తలే షాకిచ్చారు. మీరు పార్టీ మారితే తాము ఎవ్వరూ కూడా నీ వెంట వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చేప్పేశారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ కప్పులో తుఫాను మాదిరిగా రెచ్చిపోతున్న జగ్గారెడ్డి పార్టీ మారే అంశంపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయనకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఉంటే కాంగ్రెస్‌లోనే ఉండాలని కార్యకర్తలు, అనుచరలు చెప్పినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌ను కాదంటే.. తాము వచ్చేది లేదని.. జగ్గారెడ్డికి తేల్చి చెప్పారట. మీరు ఉంటే కాంగ్రెస్‌లోనే ఉండాలని లేకపోతే.. మీము మీ వెంట వచ్చే ది లేదు
అని బల్లగుద్దినట్టు చెప్పారట. అంతేకాదు.. మీరు టీఆర్ఎస్లో చేరినా.. స్వతత్రంగా పోటీ చేసినా.. బీజేపీలో చేరినా.. మేము వచ్చేది లేదని కుండబద్దలు కొట్టారట.