న్యాయ‌వాదిపై దాడిన ఖండించిన బండి సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ నాయ‌కులు రౌడీలుగా మారార‌ని మండిప‌డ్డారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. ప్రముఖ న్యాయవాది, బిజెపి నాయకురాలు ప్రసన్న గారిపై కొంత మంది టీఆర్ఎస్ గూండాలు మల్కాజ్ గిరి కోర్టులో దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఒక మహిళా నాయకురాలిపై న్యాయవాదుల రూపంలో టీఆర్ఎస్ దాడులు చేయించడం సిగ్గు చేటు. పిరికిపంద చర్య పేర్కొన్నారు.
టీఆర్ఎస్ కు బిజెపి అంటే అణువణువునా వణుకుపుడుతోంది. అందుకే భౌతిక దాడులకు తెగబడుతోంది. ప్రసన్న గారిపై కోర్టు పరిసరాల్లో జరిగిన దాడిని సీఎం కేసీఆర్ ఏ విధంగా సమర్ధించుకుంటారు? అని కూ యాప్ ద్వారా ప్ర‌శ్నించారు బండి సంజ‌య్‌.

https://www.kooapp.com/koo/bandisanjay_bjp/a5920ee0-b0f2-43db-9d5a-0f2b1ee59044