ఐటీ శాఖ మంత్రిగా విడుదల రజని ?
గుండెపోటుతో ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణించడం వల్ల ఆ పదవిని భర్తీ చేయడం అనివార్యమైంది. అయితే ఇప్పుడు ఆ శాఖకు మంత్రిగా ఎవరిని నియమిస్తే సమర్థవంతంగా ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచిస్తోంది. గతంలో మంత్రి పదవి వరిస్తుందని ఆశపడిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని భంగపడ్డారు. ఈ సారి మంత్రివర్గంలోకి రజనిని తీసుకోవడానికి మెగ్గు చూపుతున్నట్లు సమాచారం. గౌతం రెడ్డి అంత్యక్రియలు, దశదిన కర్మలు పూర్తయిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.