సీఎం జగన్ భార్య భారతిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన అనిత
ఏపీలో అధికార, ప్రతి పక్షాల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. రాజకీయాలు కాస్తా ఇంటి రాజకీయాలుగా మారుతున్నాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరిపై వైకాపా పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సీఎం జగన్ భార్య భారతిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రతి ఒక్కరి మోసం చేశారని ఆరోపించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్నయ్య కోసం షర్మిల ముందుకొచ్చి పాదయాత్రలు చేసి పార్టీని బలోపేతం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం జగన్ తన సొంత చెల్లెల్ని, తల్లి విజయమ్మను మోసం చేశారన్నారు.
సొంత చెల్లిని, తల్లిని మోసం చేసిన జగన్ రెడ్డి సొంత భార్యను మోసం చేయడని గ్యారంటీ ఏంటంటూ అనిత ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తులు భారతి రెడ్డి పేరు మీదే ఉన్నాయని.. కేసులన్నీ ఆమె మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా.. సాక్షిలో తప్పు రాశారన్న జగన్ ఏదైనా విషయంలో భారతి రెడ్డిని బలిచేయడు అని నమ్మకమేంటని అనిత ప్రశ్నించారు. జగన్ విషయంలో భారతి అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ఏదో ఒక రోజు ఆమె కూడా ఆయన బాధితుల జాబితాలో చేరటం ఖాయమని అనిత జోస్యం చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.