మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట్లో విషాదం
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి ఆరోగ్య సమస్యలతో ఇవాళ మృతి చెందారు. అయితే మేడారం జాతర కార్యక్రమాల పర్యవేక్షణలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్… తండ్రి మరణవార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటనే మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా బయల్దేరారు. అక్కడ తండ్రి భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పితృవియోగంతో బాధపడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్ ను సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా పరామర్శించారు. లింగ్యానాయక్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సత్యవతి రాథోడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.