హైదారాబాద్‌లో అలెక్సా దూకుడు
భారతదేశంలో ఆవిష్కరించిన నాలుగేళ్లలోనే దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు అమెజాన్ అలెక్సా వాయిస్ సేవలను ఎకోస్మార్ట్ స్పీకర్లు, ఆండ్రాయిడ్ కోసం అమెజాన్ షాపింగ్ యాప్, ఫైర్ టీవీ ఉపకరణాలు మరియు వందలాది అలెక్సా బిల్ట్ ఇన్ స్పీకర్లు, టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు మరియు మరెన్నో ఇతర బ్రాండ్లను వినియోగించారు. నాన్ మెట్రో నగరాలైనటువంటి వైజాగ్; కృష్ణా; గుంటూరు నుంచి దాదాపు 50% కు పైగా వినియోగదారులు అలెక్సాకు చేసిన అభ్యర్థనలు 2020తో పోలిస్తే 2021లో ఏకంగా 68% పెరిగాయి.
భారతదేశంలో అలెక్సా వార్షికోత్సవాన్ని వేడుక చేస్తూ అమెజాన్ ఇప్పడు బ్లాక్ బస్టర్ డీల్స్ అయినటువంటి 50%తగ్గింపును అమెజాన్ ఎకో శ్రేణి స్మార్ట్‌స్పీకర్లు, డిస్‌ప్లేలపై మరియు 43% వరకూ తగ్గింపు ఫైర్ టీవీ ఉపకరణాలు, 30% వరకూ తగ్గింపును స్మార్ట్ హోమ్ గాడ్జెట్స్ మరియు అలెక్సా బిల్ట్ ఇన్ ఉపకరణాలతో కూడిన ఒన్‌ప్లస్, బోట్, విప్రో, పానాసోనిక్, షావోమీ మరియు మరెన్నో బ్రాండ్లపై ప్రకటించింది. ఈ డీల్స్ ఫిబ్రవరి15 మరియు 16 తేదీలలో https://www.amazon.in/alexadeals.వద్ద లభ్యమవుతాయి.
‘‘అలెక్సాను మరింత ఉపయుక్తంగా మరియు ఆహ్లాదకరంగా భారతదేశంలోని వినియోగదారులకు తీర్చిదిద్దేందుకు మేము నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాము. దీనిలో భాగంగా అత్యాధునిక ఎకో షో 10ను ఇంటిలిజెంట్ మోషన్‌తో ఆవిష్కరించడం, భారతదేశపు మొట్టమొదటి సెలబ్రిటీ వాయిస్‌ను శ్రీ అమితాబ్ బచ్చన్‌తో పరిచయంచేయడం, మహీంద్రా ఎక్స్‌యువీ 700 వాహనాన్ని అలెక్సా బిల్ట్ ఇన్‌తో తీర్చిదిద్దడం వంటివి ఉన్నాయి’’ అని పునీష్ కుమార్, కంట్రీ లీడర్–అలెక్సా, అమెజాన్ ఇండియా అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘చాలా మంది వినియోగదారులు అందించిన అభిప్రాయాల ప్రకారం అలెక్సా వారి చుట్టూ ఉంటే వారి జీవితం మరింత వినోదాత్మకంగా మరియు ఉత్పాదకతతో కూడిన రీతిలో మారుతుంది. ఈ ప్రోత్సాహమే తమను మరింతగా ఆవిష్కరించేందుకు, తొలి రోజు ఏ విధంగా అయితే ఉత్సాహంతో పనిచేస్తామో అదే రీతిలో పనిచేసేందుకు తోడ్పడుతుంది’’ అని అన్నారు.
అలెక్సాతో ఇంగ్లీష్, హిందీ మరియు హింగ్లీష్‌లో వినియోగదారులు మాట్లాడవచ్చు. తద్వారా తమ అభిమాన సంగీతం, నర్సరీ పద్యాలు వినడం, స్మార్ట్ హోమ్ అప్లయెన్సస్ నియంత్రణ, సమాచారం కోసం అడగడం, బిల్లు చెల్లింపులను చేయడం, అలారం సెట్ చేసుకోవడం, ఆటలు ఆడటం మరియు మరెన్నో చేయవచ్చు. అలెక్సా ఇప్పుడు తగిన రీతిలో నామవాచకాలు – పేర్లు, ప్రదేశాలు సైతం అర్ధం చేసుకోవడంతో పాటుగా మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, పంజాబీ, ఇతర భారతీయ భాషలలో పాటలనూ అర్థం చేసుకుంటుంది.
2021లో అలెక్సా తమ వినియోగదారులకు పూర్తి వినోదాన్ని అందిస్తూ 21.6 లక్షల పాటలను ప్రతి రోజూ వినిపించింది. వీటిలో చిన్నారులు, భక్తి గీతాలు, ప్రాంతీయ భాషా పాటలు సైతం ఉన్నాయి. టాప్ 20 పాటలలో అత్యంత ప్రాచుర్యం పొందిన విభాగాలు ఇవి. అలెక్సా స్మార్ట్ హోమ్ ఎంపిక ఇయర్ ఆన్ ఇయర్ 72%కు పైగా నూతన ఉత్పత్తులతో పాటుగా వృద్ధి చెందింది. వీటిలో షావోమీ, ఒన్‌ప్లస్, హింద్‌వేర్, ఆటమ్‌బెర్గ్ వంటి బ్రాండ్ల ఉత్పత్తులు ఉన్నాయి. ప్రతి రోజూ తమ స్మార్ట్‌హోమ్ అప్లయెన్సెస్ నియంత్రణ కోసం ఏకంగా 2.6 లక్షల అభ్యర్ధనలకు అలెక్సా స్పందిస్తుంది. క్రీడలు, సినిమా డైలాగులు నుంచి పద నిర్వచనాలు నుంచి అత్యంత కఠినమైన లెక్కల సమస్యలు, వాతావరణం, తాజా స్టాక్ మార్కెట్ అప్‌డేట్స్ వరకూ వినియోగదారులు అలెక్సాను ప్రతి రోజూ 1.7 లక్షల ప్రశ్నలు వేస్తున్నారు. మార్చి–ఏప్రిల్ 2021 మధ్యకాలంలో ప్రతి రోజూ 11,500 ప్రశ్నలను కోవిడ్, ఆరోగ్యం, సంక్షేమం సంబంధించిన అంశాలను గురించి ప్రశ్నించారు. తమ రోజును అలెక్సాతో ప్రారంభించి, అలెక్సాతో ముగించడానికి సైతం వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. అలెక్సా, ‘గుడ్ మార్నింగ్’ అని ప్రారంభించి, ‘అలెక్సా, గుడ్ నైట్’ అని రోజుకు 11,520 సార్లు చెప్పడం ద్వారా ముగిస్తున్నారు.