వక్ఫ్‌బోర్డ్ ఛైర్మ‌న్‌గా న‌టుడు అలీ ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు రాజ‌కీయ ప‌రిణామాలు తారుమారువుతున్నాయి. సినీ న‌టుడు అలీని రాజ్యస‌భకు పంపుతార‌ని ఊహాగానాలు వినిపించాయి. మైనార్టీల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని అంద‌రూ భావించారు. ఇంత‌లో అలీ వక్ఫ్‌బోర్డ్ ఛైర్మ‌న్‌గా నియ‌మిస్తార‌ని మ‌రో వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా సీఎం తీసుకున్న నిర్ణ‌యం మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. ఈ మేర‌కు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకం జరిపింది. వక్ఫ్ బోర్డులో ఎలెక్టెడ్ మెంబర్ గా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను నియమించారు. నామినేటెడ్ సభ్యులుగా మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్, షబ్నం అఫ్రోజ్, అబ్దుల్ బషీరుద్దీన్, ఖాదర్ బాషా, షేక్ షరీన్ బేగంలను నియమించారు. ఈ మేరకు సీఎం జగన్ ఆమోదం తెలుపగా, అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.