దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి – కొండాపురం జగన్
మరేపల్లిలో దళితులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్. జైలులో బంధించిన 13 మందిని కూడా విడుదల చేయాలని కోరారు. ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరేపల్లిలో దళితులపై తప్పుడు కేసులు పెట్టి దళితులను అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిజానిర్దారణ కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.