గ‌జ గ‌జ వ‌ణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు సాధార‌ణ స్థాయి దాటి కిందికి పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటలు అవుతున్నా సూర్యుడి జాడ కనిపించకపోవడంతో జనం చలికి వణుకుతున్నారు. మధ్య భారతం మీదుగా వీస్తున్న పొడిగాలుల కారణంంగా కోస్తాలో చలితీవ్రత పెరిగింది. అలాగే, ఒడిశాకు అనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, తెలంగాణకు ఆనుకుని ఉన్న మధ్య కోస్తా శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. చింతపల్లిలో అత్యంత కనిష్ఠంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ శీతాకాలంలో ఇక్కడ నమోదైన అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.