దేశంలో రెండు లక్షలకు పైగా కొత్త కేసులు
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే లక్షల మందిని అల్లకల్లోలం చేసిన వైరస్ మూడోదశలో కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. తాజాగా దేశంలో కొత్తగా 2,34,281 కరోనా కేసులు నమోదయ్యాయనిక కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న 893 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని వివరించింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,52,784 గా ఉంది.
ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 18,84,937 మందికి చికిత్స అందుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,65,70,60,692 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,10,92,522కు చేరుకుంది.