టీడీపీ భారీ షాక్ వైకాపాలో చేరిన శోభా హైమావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అధికారం కోల్పోయి కోలుకోలేని స్థితిలో ఉన్న పార్టీ నుండి నాయకులు ఇతర పార్టీలకు వలసలు వెళ్తున్నారు. పార్టీలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా పని చేసిన, విజయనగరం జిల్లా ఎస్.కోటా మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి వైకాపాలో చేరింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరానని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పేద మహిళలందరికీ ప్రభుత్వ సాయం అందుతోందన్నారు.
గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చి గౌరవించారన్నారు. మన్యం వీరుడు అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు చేయటంపై హర్షం వ్యక్తం అవుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ నేతల్లో సగంమంది వైఎస్సార్‌సీపీలో చేరుతారని చెప్పారు.