మేడ్చల్ జిల్లా తెరాస అధ్యక్షుడిగా శంభిపురం రాజు
తెలంగాణలో పార్టీ పటిపటిష్టత మరింత పెంచాలని యోచిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పార్టీ కోసం పని చేస్తున్నవారిని గుర్తించి కీలక పదువులు కట్టబెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులగా ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియమించారు. పార్టీకి ప్రధాన జిల్లాగా ఉన్న మేడ్చల్ బాధత్యలను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కట్టబెట్టారు. ఈ సందర్భంగా శంభీపూర్ రాజు మాట్లాడుతూ పార్టీలో మరింత బాధ్యత పెరిగిందని, ఇది అధికారం కాదని ప్రజలకు మరింత దగ్గర అయ్యే అవకాశం అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన బాధ్యత శ్రద్దగా నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో పార్టీని అగ్రగామిగా నిలపేందుకు అందరీతో కలసి పని చేస్తానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వివిధ పార్టీల నుండి తెరాసలోకి వలసలు ఉంటాయని తెలిపారు.