విజయసాయిరెడ్డికి రఘురామ గూబపగిలే పంచ్
ఏపీ రాజకీయాల్లో సంచలన నేతగా మారారు ఎంపీ రఘురామరాజు. పార్టీలో వచ్చిన విభేదాల వల్ల ఆయన గత కొంత కాలంగా పార్టీకి దూరమైనారు. కానీ వైకాపా నేతలతో మాత్రంలో సోషల్ మీడియాలో మాటల యుద్దం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా తన సహచర ఎంపీ విజయసాయిరెడ్డితో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు ఉంటున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌కి తనదైన శైలిలో సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచారు.
ఇంతకీ ఆ ట్వీట్లు ఎంటో చూద్దాం.
‘జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా! ఏదో ప్రాపర్టీనో, వాహనాలనో అద్దెకు ఇచ్చినట్టు… నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్ మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదూ? గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా!’ అని విజయసాయి దెప్పిపొడిచారు.
విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు రఘురాజు కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. ‘అవునా? నా జీవితం నీకు, ఏ1కి భారంగా ఉందనే కదా నన్ను కూడా కడతేర్చాలనుకుంటున్నారు… పాపం వివేకానందరెడ్డి లా! ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి, సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది మిస్టర్ ఏ2!’ అని సెటైర్ వేశారు.