మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో ఒకరోజు కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 1825 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,042 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 201, రంగారెడ్డి జిల్లాలో 147 కేసులను గుర్తించారు. అదే సమయంలో 351 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు.