బండ్ల గ‌ణేష్‌కి రెండోసారి క‌రోనా పాజిటివ్‌

మూడో ద‌శ క‌రోన సినిమా రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్ప‌టి ప్ర‌ధాన హీరో, హీరోయిన్ల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. కాగా గ‌తంలో క‌రోనా సోకి జ‌యించిన వారికి కూడా మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్‌గా వ‌స్తోంది. తాజాగా సినీ నిర్మాత‌, ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు బండ్ల గ‌ణేష్‌కి మ‌రోమారు క‌రోనా బారిన ప‌డ్డారు. గత మూడ్రోజులుగా ఢిల్లీలో ఉన్నానని, ఈ సాయంత్రం కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని బండ్ల గణేశ్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లరాదని సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.