మోగిన ఎన్నికల నగరా
దేశంలో మళ్లీ ఎన్నికల హడవుడి మొదలైంది. ఈ మేరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది. యూపీలో ఏడు దశలు, మణిపూర్‌లో రెండు దశలు, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
7 విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు
జనవరి 14న తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్
తొలి దశ పోలింగ్ తేదీ ఫిబ్రవరి – 10
(యూపీలో మాత్రమే)
రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 21న
రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి -14
-(పంజాబ్, గోవా,ఉత్తరాఖండ్, యూపీ)
-ఒకే దశలో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికలు
మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 25న
మూడో విడత పోలింగ్ ఫిబ్రవరి -20 (యూపీ)
నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 27న
నాలుగో విడత పోలింగ్ ఫిబ్రవరి -23 (యూపీ)
ఐదో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 01న
ఐదో విడత పోలింగ్ ఫిబ్రవరి -27 (యూపీ, మణిపూర్)
ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 04న
మార్చి 3న ఆరో విడత ఎన్నికలు
(యూపీ, మణిపూర్)
ఏడో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న
మార్చి 7న ఏడో విడత ఎన్నికలు (యూపీ)
మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు