సినిమా టిక్కెట్లపై నాగ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో సినిమా టిక్కెట్ల విషయంపై రోజుకో దుమారం రేగుతోంది. మంత్రులు, సినిమా రంగానికి చెందిన వారికి గత కొన్నిరోజులుగా మాటల యుద్దం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సినిమా వారికి మద్దతు తెలపాల్సిన హీరా నాగార్జున టిక్కెట్ల ధరల తగ్గింపు విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎంకి ఆయన మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. అయితే సినిమా వారంత ఒకవైపు ఉంటే… నాగార్జున సినిమా వారికి మద్దతు తెలపకుండా ఎలా మాట్లాడుతారని మండిపడుతున్నారు.
అయితే టిక్కెట్ల ధరల తగ్గింపు వల్ల మరోవైపు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు టాలీవుడ్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీల విడుదల వాయిదా పడింది. తాజాగా నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి నటించిన ‘బంగార్రాజు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం నాలుగేళ్లుగా ఎంత కష్టపడిందో తనకు తెలుసని… ‘రాధేశ్యామ్’ సినిమా బృందం కూడా ఎన్నో ఏళ్లుగా శ్రమించిందని… ఈ సినిమాల విడుదల వాయిదా పడటం బాధను కలిగిస్తోందని నాగార్జున అన్నారు. ఇవి పాన్ ఇండియా చిత్రాలు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల కాకపోవడమే మంచిదని చెప్పారు. తమ సినిమాను మాత్రం విడుదల చేస్తున్నామని అన్నారు.