షర్మిల చెంతకు చేరిన గట్టు
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కి కరీంనగర్‌లో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పార్టీ నుండి తప్పుకొని బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగ పడ్డ నేత గట్టు రామచంద్రారావు గులాబీ పార్టీకి స్వస్తి పలికారు.
ఇప్పుడిప్పుడే తెలంగాణలో పురుడు పోసుకుంటున్న షర్మిల పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెరాసలో పార్టీ కోసం పని చేసిన వారికి తగిన గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. అయితే గతంలో ఏపీ సీఎం జగన్‌తో మంచి సంబంధాలు ఉండడం వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరడానికి సులవైంది. వైకాపా తెలంగాణలో ఉన్నప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా గట్టు పని చేశారు. తనదైన శైలిలో అధికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టేవారు. ఇప్పుడు షర్మిలకు తోడుగా ఆయన బాణి వినపించనున్నారు.