మోహ‌న్‌బాబు సంచ‌ల‌న లేఖ‌

హీర్ మోహ‌న్‌బాబు రాసిన లేఖ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సినీ ప‌రిశ్ర‌మ‌లోని స‌మ‌స్య‌ల‌పై క‌లిసి పోరాడుదామ‌ని త‌నదైన శైలిలో రాసుకొచ్చారు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు టికెట్‌ ధరల విషయంపై ఏపీ మంత్రులతో ఇంకా చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరూ కూడా ఈ విషయంపై మాట్లాడొద్దని నిర్మాత దిల్‌ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీనియర్‌ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా ఒక లేఖ షేర్‌ చేశారు. అందులో అనేక అంశాలను ప్రస్తావించారు.

‘అందరం కలిసి సినిమాను బతికిద్దాం. రెండు రాష్ట్రాల సీఎంలను కలిసి మనకు న్యాయం చేయాలని అడుగుదాం. మా అందరికీ నిర్మాతలు దేవుళ్లు. కానీ ఈరోజు నిర్మాతలు ఏమయ్యారు. అసలు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు.’ అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.