దేశంలో విస్తరిస్తున్న ఓమిక్రాన్
విదేశాలతో పాటు భారత దేశంలో కూడా ఓమిక్రాన్ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. చాపకింద నీరులా వ్యాప్తిస్తున్న ఈ వైరస్ పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు 400 పైగా కేసులను గుర్తించారు. ఎక్కువగా మహారాష్ట్రలో 108 పైగా కేసులతో మొదటి స్థానంలో ఉంది. 86 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్ విధింపులపై ఆలోచిస్తున్నారు. ఇక రానున్న జనవరి, ఫ్రిబవరిలో అత్యధిక కేసుల నమోదు అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.