HERO NANI హీరో నాని వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దూమారం
HERO NANI
సినీ హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దూమారాన్నే రేపాతున్నాయి. సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సినీ అభిమానులను కించపరిచినట్లే అని వ్యాఖ్యనించారు. దీంతో రంగంలో దిగిన ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా నానిపై విరుచుకుపడుతున్నారు. నాని సృహాలో లేకుండా మాట్లాడుతున్నారని, అతను ఏం మాట్లాడారో అతనికైనా అర్థం అవుతుందా అని మంత్రి కన్నబాబు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం సీఎం నిర్ణయం తీసుకున్నారని, ప్రజలకు వ్యతిరేకంగా నాని ఎలా మాట్లాడుతారని ప్రశ్నిస్తున్నారు. సినిమా టికెట్ల వ్యవహారం తీవ్రరూపు దాల్చుతోంది. టికెట్ల ధరలు తగ్గిస్తే ప్రజలను అవమానించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. సినిమా థియేటర్లలో పలు విధాలుగా దోపిడీ జరుగుతోందని, సినిమా టికెట్ల ధరలు, తినుబండారాలు, పార్కింగ్ రుసుం… ఇలా ఏది తీసుకున్నా దోపిడీయేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత అని కన్నబాబు ఉద్ఘాటించారు. అందుకే టికెట్ల ధరలు తగ్గించామని, తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు.