స్టార్టప్ ఆలోచనలను అభినంధించిన సిస్కో మరియు నాస్కామ్
నాస్కామ్ షౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకుని సిస్కోకు చెందిన సీఎస్‌ఆర్ కార్యక్రమం సిస్కో థింగ్క్యూబాటర్ తమ 4వ కోహార్ట్‌లో భాగంగా అత్యున్నత ప్రదర్శన కనబరిచిన పది స్టార్టప్స్‌ను నేడు సత్కరించారు. 2018లో సిస్కో మరియు నాస్కామ్ ఫౌండేషన్‌లు 18 యూనివర్శిటీలతో భాగస్వామ్యం చేసుకుని విద్యార్థులలో వ్యవస్థాపకత ప్రోత్సహించడం, సిస్కో థింగ్క్యూబాటర్ కార్యక్రమం క్రింద నైపుణ్యం వృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. సిస్కో థింగ్క్యూబాటర్ అనేది వర్ట్యువల్ మేకర్ స్పేస్ ప్రోగ్రామ్. దీనిని ఈ భాగస్వామ్య యూనివర్శిటీలలో నిర్వహిస్తున్నారు. అక్కడ విద్యార్థులు డిజిటల్ సాంకేతికతలు అభ్యసిస్తున్నారు. అలాగే తమ ఆలోచనలను వర్కింగ్ ప్రోటోటైప్స్‌గా మార్చుకుంటున్నారు.
ఈ సత్కార కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ సెక్రటరీ రాజేష్ అగర్వాల్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏయిమ్) మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ ; సిస్కో నుంచి సిస్కో సిస్టమ్స్ ఇండియా , ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నాయర్; సిస్కో ఆర్కిటెక్చర్, ఏపీజెసీ వైస్ ప్రెసిడెంట్ విష్ అయ్యర్ ; సిస్కో సిస్టమ్స్ ఇండియా అండ్ సార్క్ చీఫ్ పాలసీ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్ పాల్గొన్నారు. అగ్రస్థానంలో నిలిచిన టాప్ 10 స్టార్టప్స్‌లో సపియెంచురీ ; ఎనేబల్– యువర్ గ్రీన్ విండో, సుబిల్ట్, సోషియో ట్రీ, రిమోట్ హెల్త్ మానిటర్ తదితర సంస్థలు ఉన్నాయి.