టీంఇండియా వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా టెస్టు జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. డిసెంబర్ 26వ తేదీ నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సిరీస్కు రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా ఉండాలి. కానీ గాయం కారణంగా రోహిత్ సిరీస్కు దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో రాహుల్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మూడు టెస్టుల కోసం విరాట్ కోహ్లీని కెప్టెన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్టు జట్టుకు రోహిత్ స్థానంలో ప్రియాంక్ పాంచాల్ను ఎంపిక చేశారు.