సొంత గూటికి డీఎస్
తెరాస సీనియర్ నాయకులు, ఎంపీ డీ. శ్రీనివాస్ తన సొంత గూటికి వెళ్లనున్నారు. ఈ మేరకు సోనియా గాంధీతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెరాస అధికారంలో వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు కారెక్కిన డీఎస్ ఆనాటి నుండి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో మనస్థాపం చెందిన ఆయన తగిన సమయం కోసం వేచి చూశారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్దమైనారు. డీఎస్ తిరిగి పార్టీలోకి రావడంపై ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కిందని… మరల పార్టీ పూర్వవైభవం రాబోతుందని ధీమాతో ఉన్నారు.