నెల్లూరు, వరంగల్ వాసులారా సిద్దంగా ఉండండి

సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ సంగీత ప్రియులను మరోసారి స్వాగతిస్తుంది. మునపటి సంవత్సరం లో అందరి మనసులను గెలుచుకున్న ఈ పాటల వేదిక మరోసారి హృదయాల్ని గెలుచుకోవడానికి సిద్ధం అయింది.

ప్రేక్షకుల ఆనందమే తమ సంతోషంగా మార్చుకున్న జీ తెలుగు, ఎప్పుడూ తన అభిమానుల కోసం సరికొత్త షోస్ అందిస్తూ వారికి దగ్గరవుతూ ఉంటుంది. ఆ బంధాన్ని బలపరుచుకుందామని, స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్ ఆడిషన్స్ మీ ఊరిలోకి తీసుకొస్తున్నారు. మీరు 16 – 35 వయసు వారు అయితే, ఈ డిసెంబర్ 13 నెల్లూరు మరియు వరంగల్ లో ఆడిషన్స్ జరగనున్నాయి. ఎక్కడ అని అనుకుంటారా? క్రింద చూపిన వేదికకు సరైన సమయానికి వచ్చేయండి – ది సింగింగ్ సూపర్ స్టార్ అవడానికి అవకాశం దక్కించుకొండి.

నెల్లూరు – డి ఆర్ ఉత్తమ హోటల్ గ్రాండ్, ట్రంక్ రోడ్, రమేష్ రెడ్డి నగర్ డిసెంబర్ 13 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు

వరంగల్ – హోటల్ సుప్రభా నక్కలగుట్ట, ఎన్ ఎచ్ 163, బాలసముద్రం, హనుమకొండ డిసెంబర్ 13 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు

ఇంకా ఎందుకు ఆలస్యం, మీలో ప్రతిభ ఉండి, సంగీతం మీ నరనరాల్లో జీర్ణించుకొని ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇదే మీకు సువర్ణావకాశం…జీ తెలుగు వారి స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్